APPSC Job Calendar 2026 PDF Download
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ap ప్రభుత్వం APPSC Job Calender 2026 ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయబోయే ఉద్యోగాల వివరాలను జాబ్ క్యాలెండర్ ద్వారా వెల్లడిస్తారు. దీనివల్ల ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ సమయంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది వంటి విషయాలపై ముందుగానే ఒక స్పష్టత వస్తుంది.
ఈసారి విడుదల చేసిన వివరాల ప్రకారం పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి Job Calendar APPSC రిలీజ్ చేశారు. కొన్ని పోస్టులను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ద్వారా భర్తీ చేయనుండగా, మిగిలిన పోస్టులను ఇతర శాఖల ద్వారా ఫిల్ చేస్తారు.
తాజా సమాచారం : 29 జులై 2026
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, 15 ఆగస్టు 2026 నుంచి కొన్ని శాఖలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు తరువాత సెప్టెంబర్ మరికొన్ని ప్రధాన పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు జాబ్ క్యాలెండర్లో చెప్పారు.
అయితే అభ్యర్థులు అధికారిక ప్రకటన విడుదలైన తర్వాత మాత్రమే పూర్తి అర్హతలు, వయస్సు, ఎంపిక చేసే విధానం, దరఖాస్తుకు మొదటి మరియు చివరి తేదీలను పరిశీలించడం మంచిది.
జాబ్ క్యాలెండర్ గురించి వివరంగా
జాబ్ క్యాలెండర్ అనేది ప్రభుత్వం ఒక ఇయర్ లో భర్తీ చేయాలని నిర్ణయించిన ఉద్యోగాల జాబితా.
దీని ద్వారా అభ్యర్థులు ముందుగానే తేదీలు తెలుసుకోగలరు
- ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు రానున్నాయి
- సుమారు ఎన్ని పోస్టులు ఉన్నాయి
- ఏ నెలలో నోటిఫికేషన్ రావొచ్చు.
- ఏ డిపార్ట్మెంట్ ద్వారా భర్తీ జరుగుతుంది
ఇలా ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల పరీక్షలకు సిద్ధమయ్యే వారికి తగిన సమయం ఇవ్వొచ్చు.
APPSC Job Calendar 2026 : నోటిఫికేషన్ షెడ్యూల్
| విభాగం | సూచించిన సమయం | పోస్టుల సంఖ్య |
|---|---|---|
| గ్రూప్–1 | 15 ఆగస్టు 2026 | 91 |
| హోం శాఖకు చెందిన పోస్టులు | 15 ఆగస్టు 2026 నుంచి దశలవారీగా | 2,778 |
| ఇతర శాఖల పోస్టులు | 15 ఆగస్టు 2026 తర్వాత | 928 |
| గ్రూప్–2 | 15 సెప్టెంబర్ 2026 | 750 |
| ఇంజినీరింగ్ విభాగం | 15 సెప్టెంబర్ 2026 తర్వాత | 503 |
| ఇతర విభాగాలు | తరువాతి షెడ్యూల్ ప్రకారం | 506 |
గమనిక: పై వివరాలు అందుబాటులో ఉన్న జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పోస్టుల వివరాల్లో మార్పులు ఉండొచ్చు.
APPSC ద్వారా భర్తీ చేయనున్న ముఖ్యమైన పోస్టులు
APPSC Job Calender 2026 ల్లో పేర్కొన్న వివరాల ప్రకారం పలు శాఖల్లో ఉద్యోగాలను APPSC ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నారు
| పోస్టు | శాఖ | ఖాళీలు |
|---|---|---|
| గ్రూప్–1 | అన్ని శాఖలు | 91 |
| అసిస్టెంట్ డైరెక్టర్ (FSL) | హోం | 8 |
| హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు | సోషల్ వెల్ఫేర్ | 93 |
| హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు | ట్రైబల్ వెల్ఫేర్ | 48 |
| హాస్టల్ వెల్ఫేర్ పోస్టులు | బీసీ వెల్ఫేర్ | 100 |
| ASWO | సోషల్ వెల్ఫేర్ | 11 |
| ATWO | ట్రైబల్ వెల్ఫేర్ | 6 |
| టెక్నికల్ అసిస్టెంట్ | EFST | 20 |
| AEE (ఎన్విరాన్మెంట్) | EFST | 40 |
| ప్లానింగ్ AD | ప్లానింగ్ | 17 |
| ASO | ప్లానింగ్ | 251 |
| హార్టికల్చర్ ఆఫీసర్లు | హార్టికల్చర్ | 25 |
| ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్లు | ఇండస్ట్రీస్ | 95 |
| ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ | లేబర్ | 12 |
ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి అర్హతలు, విద్యార్హత, వయోపరిమితి, పరీక్ష విధానం అధికారిక నోటిఫికేషన్లో తెలుపుతారు.

ఇతర AP గవర్నమెంట్ జాబ్స్ -APPSC Job Calendar 2026 PDF Download
అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు APPSC ద్వారానే భర్తీ కావు. కొన్ని నియామకాలను ఇతర ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తాయి.
| పోస్టు | నియామక సంస్థ | ఖాళీలు |
|---|---|---|
| SI | SLPRB | 418 |
| కానిస్టేబుల్ | SLPRB | 1,970 |
| జైలు వార్డర్ | SLPRB | 171 |
| FSL | SLPRB | 64 |
| డ్రైవర్ ఆపరేటర్ (ఫైర్) | ఫైర్ శాఖ | 147 |
| సూపర్వైజర్లు | జువెనైల్ శాఖ | 49 |
| వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ | పశుసంవర్ధక శాఖ | 80 |
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు సంబంధిత నియామక సంస్థ విడుదల చేసే నోటిఫికేషన్‌ను చూసి తెలుసుకోవాలి.
ఈ జాబ్ క్యాలెండర్ వల్ల అభ్యర్థులకు ఉపయోగం ఉందా?
ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి జాబ్ క్యాలెండర్ ఎంతో ఉపయోగపడుతుంది.
- ఏ పోస్టుకు ముందుగా సిద్ధం కావాలో నిర్ణయిం తీసుకోవచ్చు.
- పరీక్షలకు సమయాన్నితగిన విదంగా ప్లాన్ చేసుకోవచ్చు.
- ఒకేసారి వచ్చే వివిధ రకాల నోటిఫికేషన్లకు ముందుగానే సిద్ధం కావచ్చు.
- అవసరమైన సర్టిఫికెట్లు, పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకునే వీలు ఉంటుంది ఉంటుంది.
- అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
APPSC అధికారిక వెబ్సైట్లో PDF ఎలా వెతకాలి?
APPSC Job Calendar 2026 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఆన్లైన్ లో వచ్చే సమాచారాన్ని వెంటనే నమ్మకుండా, ముందుగా APPSC అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవడం మంచిది.
Job Calendar appsc విడుదలైన తర్వాత ఈ క్రింది విధంగా చెక్ చెసు కోవచ్చు .
APPSC అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి. హోమ్‌పేజీలో Notifications లేదా Latest Updates ఉందో లేదో చూడాలి. అక్కడ Job Calendar కు సంబంధించిన లింక్ కనిపిస్తే దానిఓపెన్ చేయండి.
PDF ఓపెన్ అయిన తర్వాత దాన్ని మీ మొబైల్ లేదా కంప్యూటర్లో సేవ్ చేసుకొండి. అందులో ఏ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఖాళీలు ఎన్ని ఉన్నాయి, అర్హతలు ఏమిటి, అప్లికేషన్ తేదీలు ఎప్పుడు ఉంటాయి వంటి అన్ని వివరాలు చూసుకోవాలి.
Also Check – APPSC Group 1 Notification 2026: Vacancy, Eligibility
APPSC Notofication 2026 : వచ్చిన తర్వాత ఏమి చేయాలి?
జాబ్ క్యాలెండర్ చూసిన వెంటనే దరఖాస్తు చేయడం సాధ్యం కాదు. ప్రతి పోస్టుకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు.
అందువల్ల అభ్యర్థులు ఈ క్రింది పత్రాలు ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి
- విద్యా అర్హత కు సంబంధించిన సర్టిఫికెట్లు
- ఆధార్ లేదా ఇతర గుర్తింపు పత్రాలు
- కుల ధ్రువీకరణ పత్రం (అవసరం అయితె)
- EWS లేదా ఇతర రిజర్వేషన్ పత్రాలు
- ఫోటో, సంతకం
- మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ
పత్రాలు ముందుగానే సిద్ధంగా ఉంటే అప్లై చేయడం ఈజీ అవుతుంది.
ఉద్యోగాల కోసం ఎలా సిద్ధం కావాలి?
జాబ్ క్యాలెండర్ విడుదల కావడం అంటే పరీక్ష కూడా దగ్గరపడుతున్నట్టే. అందుకే ముందుగానే ప్రణాళికతో చదవడం చాలా ముఖ్యం.
ప్రతి రోజు ఒక నిర్దిష్ట సమయం కేటాయించి సిలబస్‌ను పూర్తి చేయాలి. గత ప్రశ్నపత్రాలు, మాక్ టెస్టులు, ప్రస్తుత వ్యవహారాలు కూడా చదవాలి.
ఒకేసారి అన్ని పోస్టులకు కాకుండా, మీ అర్హతకు సరిపోయే పోస్టులను ఎంపిక చేసుకుని వాటిపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది.
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో చిన్న పొరపాట్లు కూడా అవకాశం కోల్పోయేలా చేస్తాయి. అందువల్ల ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి.
- అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేయండి.
- చివరి రోజు వరకు వేచి ఉండకండి.
- దరఖాస్తు చేసే ముందు అన్ని వివరాలు ఒకసారి పరిశీలించండి.
- ఒకే మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీని ఉపయోగించండి.
- పరీక్ష తేదీలు ప్రకటించిన తర్వాత చదువుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోండి.
- అధికారిక వెబ్సైట్లో వచ్చే ప్రతి కొత్త నోటిఫికేషన్‌ను గమనించండి.
ఈ సమాచారం ఎవరికి ఉపయోగపడుతుంది?
ముఖ్యంగా కింది వారికి ఉపయోగపడుతుంది.
- APPSC ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు
- డిగ్రీ పూర్తి చేసిన యువత.
- గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు సిద్ధమవుతున్న వారు
- ప్రభుత్వ ఉద్యోగాల కోసం మొదటిసారి అప్లై చేయాలనుకునే వారు
- తాజా ఉద్యోగాల సమాచారం తెలుసుకోవాలనుకునే వారి కోసం.
అధికారిక సమాచారం
ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు, దరఖాస్తు తేదీలు, అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ వంటి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో మాత్రమే కరెక్ట్ గా ఉంటాయి
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs) : APPSC Job Calendar 2026
1. జాబ్ క్యాలెండర్ విడుదల అయితే వెంటనే దరఖాస్తు చేయవచ్చా?
లేదు. జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల ప్రణాళికను మాత్రమే ఇస్తుంది. ప్రతి పోస్టుకు వేర్వేరుగా అధికారిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
2. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను ఒకే సంస్థ భర్తీ చేస్తుందా?
లేదు. కొన్ని పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తే, మరికొన్ని పోస్టులకు సంబంధిత ఇతర నియామక సంస్థలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి.
3. పరీక్షలకు ఎప్పుడు సిద్ధం కావడం మంచిది?
నోటిఫికేషన్ కోసం ఎదురుచూడకుండా జాబ్ క్యాలెండర్ విడుదలైన వెంటనే సిలబస్ ఆధారంగా సిలబస్ ని ప్రారంభిస్తే ఎక్కువ సమయం దొరుకుతుంది.
4. పోస్టుల సంఖ్యలో మార్పులు వచ్చే అవకాశం ఉందా?
నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఖాళీలు లేదా ఇతర వివరాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే అధికారిక ప్రకటనను మాత్రమే ఆధారంగా తీసుకోవాలి.
5. దరఖాస్తు చేసే ముందు ఏ పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి?
విద్యార్హత సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలు, ఫోటో, సంతకం, రిజర్వేషన్‌కు సంబంధించిన పత్రాలు (వర్తిస్తే) ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.
6. ఉద్యోగాల తాజా సమాచారం ఎక్కడ తెలుసుకోవచ్చు?
సంబంధిత నియామక సంస్థ అధికారిక వెబ్సైట్లో విడుదల చేసే నోటిఫికేషన్లు, ప్రకటనలు, పరీక్ష షెడ్యూల్‌లను ఎప్పటికప్పుడు చూడాలి.
ముగింపు : AP Government Jobs Notifications Latest 2026
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు జాబ్ క్యాలెండర్ చక్కగా ఉపయోగపడుతుంది. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు రానున్నాయి, సుమారు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అనే విషయాలపై ముందుగానే ఇస్తారు.
ముందుగానే ప్రణాళిక వేసుకొని, అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని, అధికారిక సమాచారాన్ని చూసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం సాధించ వచ్చు
రచయిత :Pranesh
ఈ వ్యాసాన్ని అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం, విడుదలైన జాబ్ క్యాలెండర్ వివరాలు మరియు విశ్వసనీయ ప్రభుత్వ ప్రకటనల ఆధారంగా సిద్ధం చేశాను. కొత్త నోటిఫికేషన్లు లేదా మార్పులు చేసినపుడు మళ్ళి ఈ సమాచారం అవసరమైన మేరకు అప్డేట్ అవుతుంది
(Disclaimer)
ఈ ఆర్టికల్ సమాచారం ప్రస్తుతం అందుబాటులో ఉన్న APPSC Job Calender 2026 PDF వివరాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. పోస్టుల సంఖ్య, నోటిఫికేషన్ తేదీలు, అర్హతలు లేదా ఇతర నియామక వివరాల్లో అధికారిక ప్రకటన తర్వాత మార్పులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి దరఖాస్తు చేసే ముందు సంబంధిత అధికారిక నోటిఫికేషన్‌ను తప్పకుండా చూడాలి.